భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తం

హైదరాబాద్ లో కుండపోత వాన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మాన్ సూన్ టీమ్స్ ఇప్పటికే రంగంలోకి దిగాయని గ్రేటర్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు.  అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు వెళ్లొద్దని జనార్దన్ రెడ్డి చెప్పారు.