భారీ ఆఫర్ ను వదులుకున్న రేజీనా, ప్రగ్యా

అందాల తారలు రెజీనా  ప్రగ్యా జైస్వాల్ నక్షత్రం సినిమాతో మాస్ హీరోయిన్స్ అయిపోవచ్చనుకున్న ఆశలు అడియాశలయ్యాయి ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో రెజీనా – ప్రగ్యా ఒలికించిన అందాల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. అయితే నక్షత్రం ఒపెనింగ్స్ కి మాత్రం ఈ ఇద్దరు బ్యూటీలు బాగానే కలిసొచ్చారని చెప్పవచ్చు. దీంతోనే ఈ ఇద్దరు బ్యూటీలకి అటు తమిళంలో ఇటు తెలుగులో బాగానే అవకాశాలు వస్తున్నాయి. కానీ ఆ ఆఫర్స్ అన్నీ మీడియం రేంజ్ హీరోలు సరసనే వస్తుండంటంతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. తాజాగా వీరిద్దు ఓ భారీ ఆఫర్‌ను వ‌దులుకున్నారు. బాలయ్య 102వ సినిమా ఎన్ బి కే కర్ణలో రెజీనాకు హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందట. కానీ ఈ బ్యూటీ బాలయ్య సరసన నటించేందుకు నిరాకరించిందని తెలిసింది. ఇదే అవకాశం ప్రగ్యాజైస్వాల్ కు వచ్చింది. కానీ ఆమె కూడా ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే వీరిద్దరికి ఆఫర్ చేసిన పాత్రల నిడివి చాలా తక్కువుగా ఉండటంతో రిజెక్ట్ చేసి ఉంటారని అంటున్నారు. కానీ బాలయ్య వంటి మాస్ హీరో సరసన నటించే అవకాశం వస్తే ఇలా ఏవో కారణాలు చెప్పి వదలుకోవడం రాంగ్ స్టెప్ అంటూ ప్రగ్యా – రెజీనాల పై ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.