భారత్- పాక్ సరిహద్దులో కాల్పులు

భారత్- పాక్ సరిహద్దు వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. పూంచ్ సెక్టార్ లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడ్డారు. ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరుపడంతో, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ వాహనం ధ్వంసమైంది. కాల్పుల్లో గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.