భారత్ ఘన విజయం

నాగపూర్ వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఐదు వన్డేల సిరీస్ లో 4-1 తో భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ఆసిస్ విధించిన టార్గెట్ ను ఇండియా అలవోకగా ఛేదించింది. కేవలం మూడు వికెట్ల నష్టానికి 42.5 ఓవర్లలోనే 243 పరుగులు చేసింది. రోహిత్ శర్మ సెంచరీ(125)తో, రహానే అర్ధ సెంచరీ(61)తో చెలరేగడంతో ఆసిస్ విధించిన టార్గెట్ ను ఛేదించడంలో భారత్ కు సులువయ్యింది.