బెలూన్లు పేలి 15 మందికి గాయాలు

చండీఘడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్  సందర్భంగా నైట్రోజన్ గ్యాస్ బెలూన్లు ఎగురవేసిన గ్యాస్ బెలూన్లు పేలి 15 మంది గాయపడ్డారు. గ్యాస్ బెలూన్లు పైకి వెళ్లే సమయంలో అక్కడే ఉన్న కరెంట్ బల్బ్ కు తగలడంతో ప్రమాదం జరిగింది. చండీఘడ్ సెక్టార్ 34లో నిన్న సాయంత్రం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు.