బీకే యాదవ్ కు నివాళులు అర్పించిన నిర్మల్ సింగ్

శ్రీనగర్ లో నిన్న ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందిన ఏఎస్ఐ బీకే యాదవ్ కు నివాళులు అర్పించారు జమ్మూకాశ్మీర్ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్. శ్రీనగర్ ఏయిర్ పోర్ట్ సమీపంలోని బీఎస్ఎఫ్ క్యాంప్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఘటనలో బీకే యాదవ్ తీవ్రంగా గాయపడి…చికిత్స పొందుతూ మరణించారు. ఆయన భౌతిక కాయానికి అధికారిక లాంఛనాలతో కాసేపట్లో అంత్యక్రియలు జరుపనున్నారు. నిర్మల్ సింగ్ తో పాటూ పలువురు ఆర్మీ, బీఎస్ఎఫ్ అధికారులు బీకే యాదవ్ కు నివాళులు అర్పించారు.