బాసర వద్ద ఉధృతంగా గోదావరి

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో బాసర వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. విష్ణుపూరి ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేయడంతో  గంటగంటకు నీటి మట్టం పెరుగుతుండటంతో గోదావరి నదీతీరం సందర్శకులకు కనువిందు చేస్తోంది. బాసర స్నానఘట్టాల వద్ద సందడి వాతావరణం నెలకొంది