ప్రభుత్వం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం

రాష్ట్రంలో ముఖ్యమైన పండుగలు, ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మరో ఉత్సవాన్ని కూడా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 21న ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ నారాయణగూడలో సదర్ ఉత్సవాలు భారీ ఎత్తున నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రకటించారు. సదర్ ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పోలీస్, ట్రాఫిక్, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలు నిర్వహించాలని చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.