ప్రధాని మోడీపై ప్రకాశ్ రాజ్ ఫైర్

ప్రధాని నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు నటుడు ప్రకాశ్ రాజ్. మోడీ తన కంటే ఎక్కువగా నటిస్తున్నారన్నారు. జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై ఇప్పటి వరకు నోరు మెదపని ప్రధాని నరేంద్ర మోడీ తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని స్పందించకపోతే…తన నేషనల్ అవార్డులను వెనక్కి ఇచ్చేస్తానన్నారు. వామపక్షాలకు చెందిన డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్.. ప్రధానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గౌరీ లంకేష్‌ హత్యపై మోడీ ఫాలోవర్లు సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నారు ప్రకాశ్ రాజ్.  తన అనుచరుల చర్యలపై ప్రధాని మౌనంగా ఉండటం చూస్తే.. ఆయన నా కన్నా మంచిగా నటిస్తున్నారన్నది తెలుస్తున్నదన్నారు.