పోలీసుల సమస్యలపై ప్రజలకు అవగాహన

పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తమన్నారు డీజీపీ అనురాగ్ శర్మ.ఇందు కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తమని చెప్పారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తమన్నారు.పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 14న పోలీస్ ఎక్స్ పో, 15న 2కే, 5కే, 10కే రన్ నిర్వహిస్తమన్నారు. రన్ లో పాల్గొనే వారు www.policerun.com లో రిజస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.