పేదలందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు

సికింద్రాబాద్ నియోజకవర్గంలోని లాలాపేట సాయినగర్ లో 89 మంది లబ్ధిదారులకు మంత్రి పద్మారావు చేతుల మీదుగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్లు అందజేశారు.

లాలాపేటలోని రైల్వే స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని దానికి బదులుగా చర్లపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ భూమిని కేంద్రానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మంత్రి పద్మారావు తెలిపారు. అతి త్వరలోనే మరోసారి రైల్వే శాఖ మంత్రిని కలిసి లాలాపేట రైల్వేభూమి అనుమతిని తీసుకొని పేద ప్రజలకు ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తామన్నారు. నియోజకవర్గంలో స్థలాల కొరత ఉండటం వల్ల ఇండ్ల నిర్మాణంలో కొంత ఆలస్యం అవుతోందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ స్థలాలు వున్నా తన దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో చంద్రకళను ఆదేశించానని చెప్పారు. ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. నియోజక వర్గంలో 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని నిర్మించి తీరుతానని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు ఆలకుంట సరస్వతి, హేమ, ధనంజన, ఆర్డీవో చంద్రకళ, హౌసింగ్ అధికారులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.