పిడుగుపాటు మృతుల కుటుంబాలను ఆదుకుంటాం

సిద్ధిపేట జిల్లా కోహెడ మండలంలో నిన్న పిడుగుపాటుకు గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు ఎంపీ వినోద్‌. తీగలగుంటపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల్లో మృతుల నివాసాలకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని.. మృతుల పిల్లల చదువు బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట  ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ ఉన్నారు.