పాలేరు పాత కాల్వను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

పాలేరు పాత కాల్వను ప్రారంభించారు మంత్రులు హరీష్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు. 23.5 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పాలేరు పాత కాల్వ కింద 25 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని మంత్రులు ప్రకటించారు. కేవలం నాలుగున్నర నెలల సమయంలో కాల్వ పనులు పూర్తి చేసి చరిత్ర సృష్టించామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో శిలాఫలకాలు వేసారే తప్ప.. ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్‌ నేతల జేబులు నిండాయే తప్ప.. రైతులుకు ఒరిగిందేమీ లేదని తీవ్రంగా ఫైరయ్యారు.