పటాకుల అమ్మకాలపై నిషేధం ఎత్తివేసేది లేదు!

ఢిల్లీలో పటాకుల అమ్మకాలపై నిషేధం ఎత్తివేసేందుకు మరోసారి నిరాకరించింది సుప్రీం కోర్టు. తమ తీర్పును మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. పటాకుల విక్రయాలపై నిషేధం ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ వ్యాపారుల పిటీషన్ పై విచారణ జరగింది. తమ తీర్పులో ఎలాంటి మార్పులు చేసే ఆలోచన లేదని సుప్రీం తేల్చి చెప్పింది. అంతేకాదు, రాత్రి 11 గంటల తర్వాత పటాకులు కాల్చడంపై కూడా సుప్రీంకోర్టు నిషేధం విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇక తమ తీర్పుపై దేశ వ్యాప్తంగా వస్తున్న విమర్శలపై జడ్జీలు స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును మతంతో ముడిపెట్టి చూడవద్దని, మతపరమైన విమర్శలు తమకు బాధ కలిగించాయని పేర్కొంది.