పంచకుల అల్లర్ల మాస్టర్ మైండ్ హనీప్రీత్?

హర్యానాలోని పంచకుల అల్లర్లకు డేరా బాబా దత్తపుత్రిక హనీప్రీత్ నే కారణమని హర్యానా పోలీసులు తేల్చారు. గుర్మీత్‌ రాం రహీం సింగ్ ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత.. చోటు చేసుకున్న అల్లర్ల కోసం ఆమె కోటీ  25 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. హింసాయుత ఘటనలకు హనీప్రీతే మాస్టర్ మైండ్ అని, డేరా బాబా అనుచరులను రెచ్చగొట్టడంలో ఆమెనే కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు. కస్టడీలో ఉన్న గుర్మీత్‌ వ్యక్తిగత సిబ్బంది, డ్రైవర్‌ రాకేశ్‌ కుమార్‌ ను విచారించగా ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయన్నారు. కోర్టు తీర్పుకు రెండు రోజుల ముందే.. డేరా బ్రాంచ్‌ హెడ్‌ కు హనీప్రీత్‌  ఆ డబ్బులను ఇచ్చిందన్న పోలీసులు.. దీనికి సంబంధించిన ఆన్‌లైన్‌ నగదు బదిలీ వివరాలు కూడా ఉన్నట్లు చెప్తున్నారు.