నేను చాలా బిజీ..! బిజీ..!

మిల్కీ బ్యూటీ తమన్నాకు సినిమాలు తగ్గిపోయాయి అంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. బాహుబలి 2 వంటి చిత్రంలో ఆమె కనిపించింది కొన్ని క్షణాలే. తమన్నా హీరోయిన్‌గా ప్రమోషన్‌ పొంది పదేళ్ళు అవుతోంది. స్టార్స్‌ అందరితో నటించింది. తమిళ్‌, హిందీ చిత్రాల్లో సైతం సత్తా చాటుకుంది. సోలో హీరోయిన్‌గా నటించిన అభినేత్రి పరాజయం ఊహించనిది. మరోవైపు పరిశ్రమకు కొత్త కొత్త నాయికలు రావడంతో తమన్నాకు గతంలో ఉన్న డిమాండ్‌ తగ్గిందనే మాట వినిపిస్తోంది. అందుకే ఐటమ్‌ పాటలు చేయడానికి సై అంటోందని జరుగుతున్న ప్రచారానికి చెక్‌ పెడుతూ నాకు చాలా సినిమాలున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నేను మూడు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నాను. తెలుగులో కల్యాణ్‌రామ్‌ సినిమా చేస్తున్నాను. దీనికి జయేంద్ర దర్శకుడు. తమిళంలో పెళ్లిచూపులు రీమేక్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నాను. చక్రి తోలేటి దర్శకత్వంలో మూడు భాషల్లో తెరకెక్కుతున్న సినిమాలో చేస్తు న్నాను. ఇందులో ప్రభుదేవాతో కలిసి నటిస్తున్నా. తమిళ స్టార్‌ విక్రమ్‌ హీరోగా నటిస్తున్న స్కెచ్‌ సినిమాలో నటిస్తున్నా. అలాగే హిందీ డైరెక్టర్‌ కునాల్‌ కొహ్లి దర్సకత్వంలో రూపొందే తెలుగు చిత్రంలో నటించడానికి అంగీకరించాను. ఇన్ని సినిమాలు చేస్తున్నాను మరి నాకు సినిమాల్లేవు అని జరుగుతున్న ప్రచారం సరికాదు అని స్పష్టం చేసింది.