నాగార్జున సాగర్ కు పోటెత్తిన వరద

నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు  వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తడంతో లక్ష ముప్పై ఒక్క వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. అవుట్ ఫ్లో 1350 క్యూసెక్కులు ఉంది. అటు స్థానికంగా కృష్ణానదికి వస్తున్న వరదలతో సాగర్ కు మరింత ఇన్ ఫ్లో పెరిగింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం  590 అడుగులు కాగా ప్రస్తుతం 528.70 అడుగులకు చేరుకుంది. సాగర్ కు భారీగా వరదనీరు వస్తుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.