నవంబర్ 7న కమల్ పార్టీ ప్రకటన

తమిళనాడులో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తమిళ నటుడు కమల్‌ హాసన్‌ ఆధ్వర్యంలో కొత్త పార్టీ ప్రారంభం కానుంది. ఇప్పటికే కమల్‌ రాజకీయ ఎంట్రీ పై చాలా ఊహాగానాలు వచ్చాయి. ఐతే తాజాగా కమల్‌ సన్నిహితులు పొలిటికల్ పార్టీ రావటం ఖాయమని సంకేతాలు ఇచ్చారు. వచ్చే నెల 7 న కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ అన్సౌన్‌ చేస్తారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి గ్రౌండ్ వర్క్ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా తన అభిమాన సంఘాల జిల్లా కార్యదర్శులతో కమల్‌ హాసన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారితో పార్టీ ఆవిర్భావం, జెండా-అజెండా, పార్టీ విధివిధానాల గురించి చర్చించారు.