దేశ వ్యాప్తంగా ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు?

దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకే సారి అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కావాల్సిన ఓటింగ్ మిషన్లను త్వరలోనే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగా జరిగితే…వచ్చే ఏడాది సెప్టెంబర్ లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశముంది. అయితే ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చే అవకాశముంది. అంతేకాదు అన్ని రాజకీయ పార్టీలను ఏకాభిప్రాయానికి తీసుకురావాల్సి ఉంటుంది. కొన్ని చట్టపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయని ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. అయితే వచ్చే ఏడాదిలోగా చిక్కులన్నింటినీ…క్లియర్ చేయాలని కేంద్రం భావిస్తోంది.  ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే పెద్ద ఎత్తున ఈవీఎంలు, పేపర్ ట్రయల్ మిషన్లు అవసరం ఉంటుంది. దీంతో ముందస్తుగానే వాటిని సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ లోగా 40 లక్షల పేపర్ ట్రయల్ మిషన్లు సిద్ధం కానున్నాయి.