దుండిగల్ లో విద్యార్ధిని ఆత్మహత్య

హైదరాబాద్‌ దుండిగల్‌లో మౌనిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు మౌనిక ఇన్‌స్టా గ్రాంలో సూసైడ్‌ నోట్‌ పోస్ట్‌ చేసింది. తన జీవితం దుర్భరంగా మారిందని పోస్ట్‌ పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అయితే కుటుంబ కలహాలే మౌనిక ఆత్మహత్యకు కారణమై ఉండోచ్చని పోలీసులు తెలిపారు.