త్వరలో సింగరేణి యాత్ర చేపడుతా

వచ్చే పదిహేను రోజుల్లో సీఎం సింగరేణి యాత్ర పేరుతో గనుల్లో పర్యటిస్తానన్నారు.. సీఎం కేసీఆర్. మొత్తం సింగరేణి ఏరియాలో పర్యటించి కార్మికుల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుంటానని చెప్పారు. వైద్య సౌకర్యాలు, ఇండ్లు, కరెంటు తదితర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యాత్ర తరువాత సింగరేణిలో లంచాలు బంద్ కావాలన్నారు.. సీఎం కేసీఆర్.