తిరుమల వచ్చిన శ్రీలంక ప్రధాని

వెంకన్న దర్శనం కోసం శ్రీలంక ప్రధాని మైత్రిపాల సిరిసేన తిరుమలకు చేరుకున్నారు. తిరుమల పద్మావతి అతిథి భవనంలో ఆయనకు బస ఏర్పాటు చేశారు. మైత్రిపాలకు టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. రేపు తెల్లవారు జామున జరిగే శ్రీవారి సుప్రభాత సేవలో మైత్రిపాల పాల్గొంటారు. రేపు ఉదయం 8 గంటలకు తిరుమల నుండి బెంగళూరు విమానాశ్రయానికి రోడ్డుమార్గంలో వెళ్తారు. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో శ్రీలంక చేరుకుంటారు.