తిరుమలలో భక్తులకు కరెంట్ షాక్

తిరుమల శ్రీవారి ఆలయ దర్శనానికి వెళుతున్న భక్తులకు కరెంట్ షాక్ తగిలింది. మహాద్వారం పక్కనున్న లగేజీ స్కానింగ్ క్యూ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. భక్తులు భయాందోళనతో పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది భక్తులు గాయపడ్డారు. మహాద్వారం వద్ద నుండి భక్తులు బయటకి పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు కరెంట్ సరఫరా నిలిపివేశారు.