తాజ్ మహల్ ను కూల్చేయండి

వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌ గా నిలిచే…యూపీ మాజీ మంత్రి ఆజంఖాన్‌ మళ్లీ అలాంటి కామెంట్లే చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని ఆయన అన్నారు. యూపీ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాలోతాజ్‌మహల్‌ పేరు పేర్కొనలేదు. దీంతో యోగి సర్కార్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐతే యోగి సర్కార్ తీరుకు నిరసనగా తాజ్‌మహల్‌ను కూల్చివేయాలని ఆజంఖాన్ కోరారు. అలా చేస్తే తన మద్దతు కూడా ప్రభుత్వానికి ఉంటుందన్నారు. తాజ్‌ మహల్‌ వైభవాన్ని తక్కువ చేసి చూపాలని యోగి సర్కార్ భావిస్తున్నందున ఆయన ఇలాంటి కామెంట్లు చేశారు.