ఢిల్లీ మెట్రో స్టేషన్ లో రగడ

ఢిల్లీలోని ఆజాద్ పూర్ మెట్రో స్టేషన్ లో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు ప్యాసింజర్ల మధ్య గొడవను ఆపేందుకు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గాల్లోకి కాల్పుడు జరిపాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనంతా మెట్రో స్టేషన్ లోని సీసీటీవీలో రికార్డయింది.  ఇద్దరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ…క్రమంగా పెరిగింది. అదికాస్తా  రెండు గ్రూపుల గొడవగా మారడంతో….జోక్యం చేసుకున్న కానిస్టేబుల్ వారిని ఆపేందుకు యత్నించాడు. కానీ వారు వినకపోవడంతో…గన్ తీసి గాల్లోకి కాల్పులు జరిపాడు. అయినప్పటికీ…రెండు గ్రూపులు కొట్లాట ఆపలేదు. దీంతో మిగిలిన పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు.