ఢిల్లీలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె

ఢిల్లీలో మరోసారి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెకు దిగారు. వేతన బకాయిలు చెల్లించాలంటూ ఉత్తర ఢిల్లీలో శానిటేషన్ వర్కర్లు విధులను బహిష్కరించారు. దాంతో పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించాలంటూ కార్మికులు రోడ్లపై నిరసన కార్యక్రమాలు చేశారు.  ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు. గతంలో కూడా పలుమార్లు కార్మికులు వేతన బకాయిల కోసం ఆందోళనలకు దిగారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించలేదు. దీంతో మరోసారి సమ్మెకు దిగారు కార్మికులు.