డ్రైనేజీ పొంగడానికి అవే కారణం

హైదరాబాద్ లో బిల్డింగ్ మెటీరియల్, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను నాలాల్లో వేయడం వల్ల అవి నిండి పొంగిపొర్లుతున్నాయని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి చెప్పారు. డ్రైనేజీ కెపాసిటీ తగ్గడానికి ఇవే కారణమన్నారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లడం, రోడ్లపై నీళ్లు నిలవటంపై ఆయన స్పందించారు. జీహెచ్ఎంసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.

వర్షం వస్తుందంటే స్పందించే లోపలే ఎక్కువ వర్షపాతం కురుస్తోందని జనార్దన్ రెడ్డి చెప్పారు. తాజా వర్షాలకు నగరంలోని 185 చెరువులు నిండి మత్తడి పారిందని తెలిపారు. నగరంలో 11 రోడ్ వల్నరబుల్ పాయింట్స్ ను గుర్తించామని, ఈ పాయింట్స్ లో ఎక్కువ గా ప్లాస్టిక్ తట్టుకోవడం వల్ల ఇబ్బంది కలిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ వివరించారు.  ఐదు సంవత్సరాలు దాటిన రోడ్లను మరోసారి పరీక్షించి మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాట్ హోల్స్ ను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేస్తున్నామని చెప్పారు.