మరో కారుని ఢీకొట్టిన నటుడు రాజశేఖర్ కారు!

హైదరాబాద్ పీవీ ఎక్స్ ప్రెస్ వే పై సినీ నటుడు రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైంది. రాజశేఖర్ కారు ఎదురుగా వెళుతున్న మరొక కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రాజశేఖర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్  చేశారు. ఆయన మద్యం సేవించలేదని టెస్టులో తేలింది. కేవలం వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగిందని రాజేంద్రనగర్ ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.