ట్విట్టర్ లో వీళ్లిద్దరు 1,3

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్  ట్రంప్  మరో అరుదైన ఘనత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్‌  లో ఎక్కువ మంది ఫాలోఅవుతున్న నేతగా ట్రంప్‌  నిలిచారు. దాదాపు 40 మిలియన్ల మంది ఆయన్ని ఫాలో అవుతున్నారు. ఈ విషయం ట్విప్లోమసీ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో పోప్‌  రెండో స్థానంలో ఉండగా.. ఇండియా ప్రధాని మోడీ మూడో స్థానంలో నిలిచారు. ట్రంప్‌  ట్విటర్‌ అకౌంట్‌  ను 40 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. పోప్‌  ను 39 మిలియన్లు, మోడీని 35 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఇక ప్రధాని మోదీ పీఎంవో ఇండియా ట్విటర్‌ ఖాతా 21 మిలియన్ల మంది ఫాలోవర్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మహిళల విభాగంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌  ప్రపంచంలోనే తొలిస్థానంలో నిలిచారు. దాదాపు 9.6 మిలియన్ల మంది ఫాలోవర్లతో ఆమె ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.