ట్రంప్ గురించి మొదటి భార్య ఏమన్నదంటే..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్‌ రాసిన బుక్‌ త్వరలో విడుదల కానుంది. రైజింగ్‌ ట్రంప్‌ పేరుతో రాసిన ఈ బుక్‌లో తన వైవాహిక జీవితం, ట్రంప్ ఎదుగుదలతో పాటు ఆయన నుంచి దూరమయ్యేందుకు దారితీసిన పరిస్థితుల గురించిన ఎన్నో విషయాలను ప్రస్తావించారు. డొనాల్డ్ ట్రంప్ పర్సనల్  లైఫ్ కు సంబంధించిన కొన్ని అంశాలపైనా ఆమె చర్చించారు. 1977లో ట్రంప్ – ఇవానా పెళ్లి జరగగా.. 1992లో వాళ్లిద్దరూ విడిపోయారు. తమ వైవాహిక బంధం తెగిపోతుందన్న విషయం తనకు 1989లోనే తెలుసని ఇవానా తన బుక్ లో పేర్కొన్నారు. ట్రంప్ రెండో భార్య మర్లా మ్యాపిల్స్ ఒక రోజు తమ ఇంటికి వచ్చి తాను ట్రంప్ ను ప్రేమిస్తున్నానని చెప్పిందని, ఆ మాట వినగానే తాను షాక్ అయినట్లు వివరించారు. ఈ ఘటనతో తమ వివాహ బంధం ముగింపు దశకు వచ్చిందన్న భయం పట్టుకుందని ఇవానా పుస్తకంలో వివరించారు.