టీబీజీకేఎస్ తోనే కార్మికుల సమస్యల పరిష్కారం

సింగరేణి కార్మికుల సమస్యలు కేవలం తెలంగాణ బొగ్గు గని కార్మక సంఘంతోనే పరిష్కారం అవుతాయని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి ఎన్నికల ప్రచారంలో భాగంగా టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిపెండెంట్ ఉద్యోగాలు కారుణ్య పద్ధతిలో నియమిస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషించే విషయమన్నారు ఎంపీ దయాకర్. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపు ఖాయమని ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు.  ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆరోపణలు సీఎం కేసీఆర్ కు కొత్త కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్, సింగరేణి వారసత్వ ఉద్యోగులు సాధించి తీరుతారని అన్నారు.

ఈ సమావేశం సందర్భంగా పలువురు సింగరేణి కార్మికులు టీబీజీకేఎస్ లో చేరారు. ఈ సమావేశంలో ఎంపీలు వినోద్, దయాకర్ తో పాటు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.