టీఆర్ఎస్వీ నేతలకు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం

టీఆర్ఎస్వీ కార్యకర్తలందరికి త్వరలో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్వీ కార్యవర్గం, సమన్వయకర్తలతో ఇవాళ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఆ తర్వాత సమావేశం వివరాలను టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పల్లా మీడియాకు వివరించారు. విద్యార్థి నాయకులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారని పల్లా చెప్పారు. ఏ విద్యార్థి సంఘానికి లేని మెంబర్ షిప్ టీఆర్ఎస్వీకి ఉందన్నారు.

తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలను సీఎం కేసీఆర్ వివరించారని టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.