టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ చివరి దశకు చేరుకుంది. మహారాష్ట్రలోని నాగపూర్ లో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

వన్డేల్లో టీమిండియాకు నెంబర్ వన్ ర్యాంక్ ఊరిస్తోంది. నాలుగో వన్డేలో ఓడి టాప్ ర్యాంక్ కోల్పోయిన కోహ్లీ సేన.. చివరి వన్డేలో నెగ్గితేనే మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది. నాగ పూర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో టీమిండియా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బెంగళూర్ వన్డేలో ప్రయోగాలు చేసి ఓటమి పాలైన కోహ్లీగ్యాంగ్, ఈ మ్యాచ్ లో నెగ్గడానికి మళ్లీ ఫుల్ స్ట్రెంత్ తో బరిలోకి దిగుతోంది.