టాటా మోటార్స్ నుంచి మరో సరికొత్త  వెహికల్

టాటా మోటార్స్ నుంచి మరో సరికొత్త  వెహికల్ మార్కెట్లోకి విడుదలైంది. ఎన్నో ఫీచర్స్ కలిగిన ఎస్ యూవీ టాటా నెక్సాన్ కారును.. హైదరాబాద్ గచ్చిబౌలిలోకి టాటా మోటార్స్ షోరూంలో.. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ బర్మన్ మార్కెట్లోకి రిలీజ్‌ చేశారు. స్మార్ట్ కీ, పుష్ స్టార్ట్ బటన్, ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, స్టీరింగ్ వీల్ పైన మీడియా కంట్రోల్స్, హర్మాన్ 8 స్పీకర్ సిస్టం తో నెక్సాన్‌ని డిజైన్‌ చేశారు. 1.2లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్,  1.5 లీటర్ రెవోటార్క్ డీజిల్ ఇంజన్‌లతో నెక్సాన్‌ అందుబాటులో ఉంది. టాటా నెక్సాన్ పెట్రోల్ ఇంజన్ ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర 5 లక్షల 92 వేలు, డీజిల్ వెర్షన్ లో 6 లక్షల 92 వేలుగా ఉంది.