జోనల్ వ్యవస్థపై ఉన్నతస్థాయి సమావేశం

జోనల్ వ్యవస్థ, రాష్ట్రపతి ఉత్తర్వులపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఏపీ పునర్వవస్థీకరణ చట్టం ప్రకారం ఆర్టికల్ 371 (డి) అమల్లో ఉందని, రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా వర్తిస్తాయని కడియం పేర్కొన్నారు. ఈ రెండింటి అమలు నేపథ్యంలో జోనల్ వ్యవస్థపై ఎలా ముందుకు వెళ్లాలని చర్చించామని చెప్పారు. స్థానిక అభ్యర్థుల హక్కులు రక్షించేలా సవరణలు చేయాలని, ఎన్ని జోన్లు, ఎన్ని కేడర్ లు ఉండాలన్నదానిపై దృష్టి సారించామని వెల్లడించారు. రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో దానికి అనుగుణంగా కొత్త జోన్లు ఉండాలన్న ఆలోచన ఉందన్నారు.

మంత్రులు హరీశ్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సీఎస్ ఎస్పీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.