జైషా స్టార్టప్ పై స్పందించిన రాహుల్

యువతకు ఉపాధి కల్పించడంపై ప్రధాని మోడీ దృష్టి సారించడం లేదన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. అందుకే మనం సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే…. ఫోన్లు తయారు చేస్తున్న చైనా యువత మాత్రం ఉపాధి పొందుతున్నారన్నారు. అంతేకాదు అమిత్ షా కుమారుడు జైషా పై కూడా సెటైర్లు వేశారు రాహుల్. స్టార్టప్ ఇండియా వల్ల ఎక్కువగా లాభపడింది జైషా కంపనీయే అన్నారు. ఒక రకంగా స్టార్టప్ ఇండియాకు జైషా కంపెనీ ఐకాన్ లాంటిదని చురకలు అంటించారు.  మోడీ అధికారంలోకి రాకముందు 50వేల పెట్టుబడితో ప్రారంభమైన కంపెనీ…60 కోట్లకు చేరుకుందన్నారు. జైషా కంపెనీపై ఇంత చర్చ జరుగుతున్నప్పటికీ…ప్రధాని మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు రాహుల్. గుజరాత్ లో పర్యటిస్తున్న ఆయన వడోదరాలో విద్యార్ధులతో సమావేశమయ్యారు.