జీడిమెట్లలో యువతి దారుణ హత్య

హైదరాబాద్ జీడిమెట్ల షాపూర్ నగర్ లో దారుణం జరిగింది. టీఎస్ ఐఐసీ కాలనీలో నివాసం ఉంటున్న సౌమ్య నిన్న కాలేజీకి వెళ్తానని చెప్పి వెళ్లి.. తిరిగిరాలేదు. అయితే దీనిపై సౌమ్య తల్లి సునీత జీడిమెట్ల పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ బంధువు వరుసకి సౌమ్యకు బావ అయ్యే క్రిష్టయ్య పైన అనుమానం ఉందని కేసునమోదు చేసింది. ఇదిలా ఉంటే..నిన్న సాయంత్రం కూకట్ పల్లి పోలీస్టేషన్ లో ఓ వ్యక్తి లొంగిపోయాడు. తానే తన మరదలిని చంపానని శవాన్ని ఐడియల్ చెరువులో పడేశానిని పోలీసులు ఎదుట చెప్పాడు. తన పేరు కృష్టయ్య అని తన మరదలు సౌమ్యను అనుకోకుండా చంపేశానని చెప్పాడు. దీంతో సంబందిత పీఎస్ కు సమాచారం అదించిన పోలీసులు.. అక్కడ మిస్సింగ్  కేసు నమోదు అవడం..రెండు మ్యాచ్  కావడంతో కేసును జీడిమెట్ల పోలీసులుకు అప్పగించారు. తనకి సౌమ్యకి మద్య గొడవ జరిగిందని కంగారులో కొట్టానని ఆమె అక్కడికక్కడే చనిపోయిందని ఏం చేయాలో తెలియక ఓ కవర్ లో కట్టి చెరువులో పడేశాని పోలీసులకు తెలిపాడు నిందితుడు. పోలీసులు నిందితుడి నుండి వివరాలు సేకరించి మృతదేహాన్ని వెలికితీసేపనిలో ఉన్నారు.