జాతీయ, అంతర్జాతీయ సదస్సు ఏదైనా.. వేదిక భాగ్యనగరమే

వందల ఏళ్ళ చరిత్ర ఉన్న హైదరాబాద్ మహానగరం.. ప్రముఖ నగరాలను తలదన్నే విధంగా జాతీయ, అంతర్జాతీయ సదస్సులకు వేదిక అవుతుంది. ఇప్పటికే అనేక సదస్సులు  హైదరాబాద్‌ లో జరగ్గా.. రోబోటిక్స్‌, ఐఓటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్  పై సదస్సు, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు, అంతర్జాతీయ టూరిజం, 105 వ  ఇండియన్‌  సైన్స్‌ కాంగ్రెస్‌, ఇంటర్నేషనల్‌ కాంగ్రెస్‌ ఆఫ్‌ సెల్‌ బయాలజీతో పాటు ఇండియన్  ఫోటోగ్రఫీ ఫెస్టివల్ అదుర్స్‌  వంటి అనేక సదస్సులు  హైదరాబాద్‌లో గ్రాండ్‌గా  జరిగాయి.

హైదరాబాద్‌ అన్ని సదస్సులకు వేదిక కావడం.. ఇక్కడి సదుపాయాలు, వాతావరణం, అభివృద్ధే కారణం.  అంతర్జాతీయ సదస్సులు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి ఉపయోగపడతాయని.. విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.  ఇక ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లోని సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లోనూ హైదరాబాద్‌ నగరం ముందుంటుంది. జేఎల్‌ఎల్‌ సిటీ మోమెంటమ్‌ ఇండెక్స్‌ లో హైదరాబాద్‌ నగరం ప్రపంచంలోనే 5 వ మోస్ట్‌ డైనమిక్‌ సిటీగా నిలిచింది. లండన్‌, అస్టిన్‌, హనోయ్‌, బోస్టన్‌ నగరాలు కూడా హైదరాబాద్‌ తర్వాత నిలిచాయి.  గత మార్చిలో మెర్సర్‌ క్వాలిటీ ఆఫ్‌ ఇండెక్స్‌ లో ఉత్తమ నగరంగా  హైదరాబాద్‌ నిలిచింది.

మతసామరస్యంతో పాటు ఇండోఅరబిక్‌ నిర్మాణ శైలి కలిగిన నగరం కావడం.. హైదరాబాద్‌ను ఇతర నగరాలలో ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ప్రత్యేకమైన మహిళల రక్షణతో పాటు పటిష్టమైన పోలీస్‌ వ్యవస్థ కూడా అంతర్జాతీయ సదస్సులు ఎక్కువగా జరగడానికి కారణంగా నిలుస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానాలతో పాటు ప్రపంచ స్థాయి కంపెనీలు గూగుల్, అమెజాన్‌, డీబీఎస్‌, యాపిల్‌ వంటి సంస్థలు హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించాయి. ఇక విదేశాల నుంచి వచ్చే అతిధులు అయితే.. హైదరాబాద్‌ నగరంను చూపి ఫిదా కావాల్సిందే. వాతావరణం, ప్రత్యేక వంటకాలు, అందమైన కట్టడాలను చూస్తూ.. హైదరాబాద్‌ సిటీ తమ బెస్ట్‌ సిటీ అని చెప్పుకుంటున్నారు.

ఇప్పటికే నిర్వహించిన పలు అంతర్జాతీయ ఈవెంట్లతో పాటు రాబోయే రోజుల్లోనూ హైదరాబాద్‌ లో పలు సదస్సులను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా.. కృత్రిమ మేథస్సు, ఇంటర్నెట్‌ అధారిత కార్యకలాపాలు, రోబోటిక్స్‌ అంశాల సమ్మిలితంగా ఎయిర్‌ సమ్మిట్‌ నిర్వహించనున్నారు. కేంద్ర ఐటీ శాఖ మద్దతుతో నిర్వహిస్తున్న ఈ సదస్సు అక్టోబర్‌ 10 నుంచి 19 వరకు హెచ్‌ఐసీసీలో జరుగుతుంది. నవంబర్‌ 28న జరిగే పారిశ్రామిక వేత్తల సదస్సుకు హైదరాబాద్‌ వేదిక కానున్నది. అమెరికా-భారత్‌ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ అధ్యక్షత వహించనున్నారు. అమెరికా పారిశ్రామిక వేత్తల బృందంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాలకు చెందిన సుమారు 1500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇదే కాకుండా.. 78వ స్కాల్‌ అంతర్జాతీయ పర్యాటక సదస్సు నిర్వహనకు హైదరాబాద్‌ ఎంపికైంది. 2002లో చైన్నైలో జరిగిన తర్వాత.. హైదరాబాద్‌కే ఛాన్స్‌ దక్కింది. అక్టోబర్‌ 5 నుంచి 9 వరకు హెహ్‌ఐసీసీ వేదికగా జరిగే సదస్సుకు.. 85 దేశాల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారు.

తెలంగాణ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు.. అంతర్జాతీయ టూరిజం సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది. 2018లో ఓయూలో 105వ ఇండియన్ సైన్స్‌ కాంగ్రెస్‌ జరగనున్నది. జనవరి 2 నుంచి 7వరకు జరిగే సదస్సుకు ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఇక జీవ పరిణామక్రమానికి మూలమైన కణంపై జరిగే జీవకణ శాస్త్ర సదస్సు.. వచ్చే యేడాది జనవరి 27 నుంచి 31వరకు నగరంలో జరగనున్నది. వెయ్యి మంది శాస్త్రవేత్తలు హాజరయ్యే ఈ సదస్సుకు చైనా సహా అనేక దేశాలు పోటీపడినా.. హైదరాబాద్‌కు మాత్రమే ఈ అరుదైన అవకాశం దక్కింది. ప్రస్తుతం ఇండియన్‌ ఫోటోగ్రఫీ ఫెస్టివల్‌ కూడా జరుగుతుంది.  40 దేశాలకు చెందిన సుమారు 525 మంది ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రఫీలో పాల్గొననున్నారు.