జరిమానా కట్టలేను!

తనకు విధించిన జరిమానాను కట్టలేనని అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా బాబా గుర్మీత్ సింగ్‌ కోర్టుకు తెలిపారు. హర్యానా రాష్ట్రంలోని పంచకుల సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం గుర్మీత్ ను దోషిగా తేల్చి 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. దీంతో పాటు 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్‌, హర్యానా హైకోర్టులో గుర్మీత్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిమానా విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. దీంతో డేరా ఆస్తులన్నీ అటాచ్‌ చేయటంతో 30 లక్షల రూపాయలు కట్టే పరిస్థితిలో తన క్లయింట్ లేడని గుర్మీత్ తరఫు న్యాయవాది తెలిపారు. అటు గుర్మీత్ పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన మరోమారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకునే వరకు జైల్లో ఉండాల్సిందే.