జమ్మూకాశ్మీర్ లో మరో భారీ ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ లో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. బండిపొరాలో ఈ ఉదయం నుంచి భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి. బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో తెల్లవారుజామున ఆపరేషన్ చేపట్టారు. అయితే ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడటంతో….ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇరు వర్గాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.