జగిత్యాల కలెక్టరేట్ కు శంకుస్థాపన

జగిత్యాల జిల్లా మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా జిల్లా ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు మంత్రి ఈటెల రాజేందర్‌, ఎంపీ కవిత, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ శంకుస్థాపన చేశారు. ధరూర్ క్యాంపులో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయహో జగిత్యాల పాటల సీడీని, జిల్లా ప్రగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు.