చేసిన పాత్ర చేయాలంటే విసుగొస్తుంది

టాలీవుడ్ లో  నేనే రాజు నేనే మంత్రి విజ‌యంతో ఫుల్‌జోష్‌గా ఉంది న‌టి కాజ‌ల్ అగ‌ర్వాల్‌. కొత్త కథలు వింటున్నప్పుడు ఇంతకుముందు చేసేసిన పాత్రల ఛాయలే ఒక్కోసారి కనిపిస్తుంటాయి. అలాంటివి మళ్లీ చేయాలంటే బోర్ కొడుతుంది. అందుకే, అలాంటివి వస్తే కనుక వద్దులెండి అని చెప్పి తప్పించుకుంటాను అని చెప్పింది. ఒకసారి చేసేసిన పాత్ర మళ్లీ మళ్లీ చేయాలంటే మహా విసుగొస్తుంది అంటోంది ఈ భామ‌.