ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు మృతి

సూర్యాపేట జిల్లాలో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలం మొద్దులచెరువు దగ్గర ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఐదుగురు మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరి కాళ్లు తెగిపోయాయి.  వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కోదాడ, సూర్యాపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏపీలోని అవనిగడ్డ డిపో బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్‌ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ టైర్ పగలడంతో రోడ్డు పక్కన ఆపి టైర్ మారుస్తుండగా ఆర్టీసీ బస్సు వెనకనుండి ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.