ఘనంగా ‘కాకా’ జయంతి వేడుకలు

మాజీ కేంద్రమంత్రి, సీనియర్‌ నాయకుడు వెంకటస్వామి జయంతి వేడుకలు.. హైదరాబాద్‌ లో ఘనంగా జరుగుతున్నాయి. ట్యాంక్‌ బండ్‌ వద్ద ఉన్న కాకా విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులతో పాటు కుటుంబ సభ్యులు ఘనంగా నివాళి అర్పించారు.  మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీలు డీఎస్‌, దత్తాత్రేయతో పాటు కాకా కుమారులు వివేక్‌, వినోద్‌ ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులు కాకా సేవలను స్మరించుకున్నారు.