గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ఆధారాలు

జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య కేసులో కీలక ఆధారాలు లభించినట్లు చెప్పారు కర్నాటక హోంమంత్రి రామలింగారెడ్డి.  గౌరీ హంతకులను గుర్తించామని, వారు తమకు తెలుసన్నారు. అయితే ఇప్పుడే హంతకుల పేర్లను బయట పెట్టబోమన్నారు రామలింగారెడ్డి. గౌరీ లంకేష్ హత్యపై సిట్ విచారణ జరుపుతున్నందున హంతకుల గురించి ఇప్పుడే బయటకు చెప్పబోమన్నారు. ఇది కేసు విచారణపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. గత నెల 5న గౌరీ లంకేష్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో హత్య దృశ్యాలు రికార్డయినప్పటికీ హంతకులెవన్నది గుర్తించలేదు