గోవాలో సందడి చేస్తున్న సమంత, చైతు

నాగ చైతన్య, సమంతల వివాహం నెల 6, 7 తేదీలలో గోవాలో జరగనుంది. అక్కినేని ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, సమంత ఫ్యామిలీతో పాటు అత్యంత సన్నిహితులు 100 వేడుకలో పాల్గొననున్నారు. పెళ్లి ఘడియలు దగ్గర పడుతుండడంతో వివాహ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. సమంత, చైతూలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనంద క్షణాలు గడుపుతున్నారు. తాజాగా సమంత, చైతూ కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్రైడ్ విషెస్ అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించిన సమంత, చైతూతో కలిసి ఫోటోకి ఫోజులిచ్చింది. ఇందులో ఇద్దరు చాలా హ్యపీగా కనిపిస్తున్నారు. 6 హిందూ సంప్రదాయ పద్ధతిలో , 7 క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. నెల 15 తేదినరిసెప్షన్ ని హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. స్టైలిష్ డిజైనర్ క్రేషా బజాజ్ డిజైన్ చేసిన దుస్తులనే సమంత వివాహ వేడుకల్లో రించనుంది.