గుజరాత్ అభివృద్ధికి ప్రధాని భరోసా

గుజరాత్‌ అభివృద్ధికి అన్ని విధాల అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. రెండు రోజుల పాటు గుజరాత్ పర్యటనకు వచ్చిన ఆయన ద్వారక, రాజ్‌ కోట్‌ లలోజరిగిన సమావేశాల్లో మాట్లాడారు. ఓకా-ద్వారక మధ్య బ్రిడ్జి నిర్మాణానికి, రాజ్‌ కోట్‌ లో ఇంటర్‌ నేషనల్‌ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.

అంతకుముందు ప్రధాని మోడీకి గుజరాత్ సీఎం విజయ్‌ రూపానీ స్వాగతం పలికారు. ద్వారకాదీశ్ ఆలయాన్ని సందర్శించిన మోడీ… గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు.  27 రకాల ఉత్పత్తులపై పన్ను శాతాన్ని తగ్గిస్తూ, చిన్న, మధ్యస్థాయి వర్తకులకు ఊరట కలిగిస్తూ జీఎస్టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాలతో దేశానికి దీపావళి పండుగ ముందే వచ్చినట్లైందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.