క్రీడలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు మంత్రి ఈటెల రాజేందర్. క్రీడాకారులను గౌరవిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాల్ ఇండోర్ స్టేడియంలో జుడో జాతీయ సబ్ జూనియర్‌ పోటీలకు ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన..విజేతలకు బహుమతులను అందజేశారు. రాబోయే రోజుల్లో క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం ముందు ఉండే విధంగా  క్రీడాకారులను తీర్చిదిద్దుతామన్నారు.