కేబీఆర్ పార్క్ లో వైల్డ్ లైఫ్ ఎగ్జిబిషన్

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ లో 63వ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా  వైల్డ్ లైఫ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. వివిధ దేశాలు వైల్డ్ లైఫ్ థీమ్ తో ముద్రించిన కరెన్సీ, స్టాంప్ లను ఈ ప్రదర్శనలో ఉంచారు. కొన్ని అరుదైన కరెన్సీ నోట్లతో పాటు 1000, 150 రూపాయల నాణేలను కూడా ఈ ప్రదర్శనలో ఉంచారు. 1792 వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశం విడుదల చేసిన నోటును కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు.