కేంద్రమంత్రి పాశ్వాన్ తో మంత్రి ఈటెల భేటి

పౌర సరఫరాల శాఖకు సంబంధించి రెండు సంవత్సరాలుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ను రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్రమంత్రిని కలిసి నిధులు త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి పాశ్వాన్ సానుకూలంగా స్పందించారని, వచ్చే నెల (నవంబర్) 18 న తెలంగాణకు రావాల్సిన బకాయిలు, సమస్యలపై సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారని ఈటెల వెల్లడించారు. ఆ సమావేశంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రపౌర సరఫరాల శాఖ నుంచి రాష్ట్రానికి 1680 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు.

కేంద్ర మంత్రి పాశ్వాన్ తో సమావేశంలో మంత్రి ఈటెల రాజేందర్ తో పాటు ఎంపీ వినోద్ కుమార్, ఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావు ఉన్నారు.